Hinduism – psrinivas.com https://psrinivas.com Mon, 23 Feb 2026 13:52:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 పితృ కార్యాలు చాలా శ్రద్ధగా, భక్తితో చేయాలి. https://psrinivas.com/2026/02/23/%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a4%e0%b1%83-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%be-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%8d/ Mon, 23 Feb 2026 13:51:57 +0000 https://psrinivas.com/?p=73
పితృ కార్యాలు చాలా శ్రద్ధగా, భక్తితో చేయాలి…

ఆపస్తంబుడు అంటే ఎవరు – (శ్రాద్ధ భోక్తలు)
యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో మూడు వంతుల మంది ఆపస్థంబసూత్రానికి చెందినవారే. ఈ ఆపస్థంబుడు అనే ఈ మహర్షి గురించి తెలుసుకుందాము.
ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం జరిపేడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు. ఆ భోక్త కోసం చాలా సేపు వేచి ఉన్నాడు. భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు. బాగా ఆకలితో వచ్చాడు.
కర్త, భోక్త గారి కాళ్లు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించేడు. వచ్చిన మిగతాసాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా భోజనం చేశాడు.
బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించేడు. వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు.
కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి హేళనకి దిగింది. మాటలలో హేళన కనబడటం మొదలైంది. దానిని లెక్క చెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు.
అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తనకు ఇంకా పెట్టు అనే అంటున్నాడు. తనని అలా ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త. వండిన పదార్థాలన్నీ అయిపోయి నా ఇంకా కావాలి ఇంకా కావాలని భోక్త అడుగుతూంటే కర్తకి కోపం వచ్చేసింది.
దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరిలో బోర్లించేసేడు. ఇంక తృప్తి అయిందా అని అన్నాడు. (భోక్త భోజనం అయిన తరువాత వారిని కర్త తృప్తాస్తాః అని అడగటం, భోక్త తృప్తోస్మి అని మూడు సారులు చెప్పటం సాంప్రదాయం కదా.) అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మ మరి ముందుకు సాగదు
కాని ఈ భోక్త లేదు నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది. ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి, నేను పెట్టిన ఈ శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు అని కోపం తెచ్చుకున్నాడు.
కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎఱ్ఱగా చేసికొని ఆయన ఈ భోక్త గా వచ్చిన బ్రాహ్మణుడిని శపించటానికి చేతిలో జలం తీసుకొని అభి మంత్రించి బ్రాహ్మణుడి తలమీద చల్లాడు.
అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతితో అభిమంత్రించి తలమీద చల్లిన జలాన్ని క్రింద, తన తలమీద పడకుండా మధ్యనే నిలిచిపో అని ఆజ్ఞాపించినట్లుగా ఆగు అని ఆపేసేడు.
కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్నచోటనే నిలబడిపోయేడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, తనకంటే గొప్ప వాడు అని తెలిసికొని, “పూజ్యుడా! మీరు ఎవరు నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు” అని అడిగేడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పేరు – “నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువలన నన్ను ఎగతాళి చేసేవు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించేవు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణుల మీద నీ పితృదేవతల ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించేవు. నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను ఇలా చేసేను శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కోపం తెచ్చు కొనకూడదని తెలుసుకో” అన్నారు.
దానికి కర్త ‘స్వామీ నా తప్పుని తెలిసికొన్నాను, క్షమించండి ఇకమీదట ఇటువంటి తప్పు చెయ్యను, నేను జరిపిన శ్రాద్ధకర్మ పూర్తికాలేదే, దానికి ఏమి చేసేది? అని అడిగేడు.
దానికి ఆ బ్రాహ్మణుడు నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు. అందుచేత పురుషసూక్తాన్ని పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది అన్నారు దానిని పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేసేడు.
జలాన్ని మధ్యను ఆపేరు గనుక ఆయనకు ఆపస్తంబులు అని పేరు వచ్చింది. శ్రాద్ధకాలంలో పురుషసూక్తాన్ని, కాటకోపనిషత్తునీ పారాయణం చేసే నియమం ఉన్నది.
ఆపః అంటే నీరు ఆ నీటిని స్తంభింపచేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్థంబులు అయినారు.
]]>
Shivaji Maharaj Landmark Statue in Vanasthalipuram https://psrinivas.com/2026/02/05/shivaji-maharaj-landmark-statue-in-vanasthalipuram/ Thu, 05 Feb 2026 03:55:04 +0000 https://psrinivas.com/?p=52 This statue of #chatrapatishivajimaharaj is installed on the Hilltop of BNReddy hill of Vanipally Brothers house who are bal #Swayamsevaks

Highlights of the statue – it faces the golkonda fort Maharaj on his favourite horse ready to attack the islamic invadors to protect the Sanathan dharama

Now this reels of this statue has become viral on the internet and shared by thousands of people and views going into millions

The location has become a iconic landmark and a inspiration to all Deshbhakts

I was fortunate enough to be part of the installation process of this statue

This statue of Chatrapati Maharaj is private installation anywhere in india or the world

God bless the Vanipally Brothers and their bhakti of Chatrapati shivaji Maharaj.Their late father was one of the connoisseurs of establishing #rss shaka and ecosystem in #Vanasthalipuram As they say nothing happens overnight

Elder Brother Sri Vanipally Srinivas Reddy  is presently BJP RR Urban President #BJP4Telangana #bjpurban and he is my political Mentor

Younger Brother Vanipally Chakradhar Reddy  is part of RSS and contributes in his own way in the Nation Building Process #RSS100Years

Vanipally family are grooming both my sons Sashi Hari Sulochan and శశాంక్ పీసపాటి and 100s of Swayamsevaks in Vanasthalipuram and instillling the seeds of Deshbhakti

My post on social media #facebook  relating to this

https://www.facebook.com/share/r/14Y1RzJUNaP/

]]>
54 steps of marriage as per dharma sindhu https://psrinivas.com/2025/12/12/54-steps-of-marriage-as-per-dharma-sindhu/ Fri, 12 Dec 2025 14:41:07 +0000 https://psrinivas.com/?p=26 *ధర్మ సింధు ప్రకారం హిందూ సంప్రదాయ వివాహ ప్రక్రియలో
వరుసగా జరగాల్సిన 54 క్రతువులు (తంతులు)

  1. కన్యావరణం:
  2. పెళ్ళి చూపులు
  3. నిశ్చితార్థం:
  4. అంకురార్పణం:
  5. స్నాతకం:
  6. సమావర్తనం:
  7. కాశీయాత్ర:
  8. మంగళస్నానాలు:
  9. ఎదురుకోలు:
  10. వరపూజ:
  11. గౌరీపూజ:
  12. పుణ్యాహవాచనం:
  13. విఘ్నేశ్వరపూజ:
  14. రక్షా బంధనం:
  15. కొత్త జంధ్యం వేయడం:
  16. గౌరీ కంకణ దేవతాపూజ:
  17. కౌతుక ధారణ:
  18. కంకణ ధారణ:
  19. మధుపర్కము:
  20. వధువును గంపలో తెచ్చుట:
  21. తెరచాపు
  22. మహా సంకల్పం:
  23. కన్యాదానం:
  24. వధూవరుల ప్రమాణములు:
    25.సుముహూర్తం-జీలకర్ర-బెల్లం:
  25. స్వర్ణ జలాభిషేకం:
  26. చూర్ణిక:
  27. వధూవర సంకల్పం:
  28. యోక్త్రధారణం:
  29. మాంగల్య పూజ:
  30. మాంగల్య ధారణ:
  31. అక్షతలు-తలంబ్రాలు:
  32. బ్రహ్మముడి:
  33. సన్నికల్లు తొక్కడం:
  34. కాళ్లు తొక్కించడం:
  35. పాణి గ్రహణం:
  36. సప్తపది:
  37. లాజహోమం:
  38. యోక్త్రవిమోచనం:
  39. స్థాళీపాకం:
  40. ఉంగరాలు తీయడం:
  41. బొమ్మని అప్పగింత:
  42. నాగవల్లి:
  43. ధ్రువనక్షత్రం:
  44. అరుంధతి నక్షత్ర దర్శనం:
  45. అప్పగింతలు:
  46. అత్తమామలకు వధువు పూజ:
  47. ఫలప్రదానం:
  48. పానుపు:
  49. మహదాశీర్వచనం:
  50. వధువు గృహప్రవేశం:
  51. కంకణ విమోచన:
  52. గర్భాదానం:
  53. పదహారు రోజుల పండుగ

హిందువుల పెళ్లి తంతులో తారసపడే ఘటనలు.మనం పురోహితులవారిని తొందరపెడితే, కొన్ని జరగవు.వారి పని వారిని చేయనీయండి.. ముఖ్యమైన కొన్ని సందర్భాలలో మాత్రమే ఫోటోగ్రాఫర్స్ ను అనుమతించి మిగతావాటిని యధావిధిగా జరిగేలా చూడాలి .వారిని తరవాత రిపీట్ షాట్స్ తీయమనండి.

]]>